![]() |
![]() |

"నీతోనే డాన్స్" ఈ శనివారం షోలో ఒక్కొక్కళ్ళు అద్దిరిపోయేలా డాన్స్ చేశారు. ఐతే గత ఎపిసోడ్స్ నుంచి చూసుకుంటే అంజలి-పవన్ డాన్స్ కి నటరాజ్ మాస్టర్ జోడి తక్కువ మార్క్స్ ఇస్తే నెక్స్ట్ ఎపిసోడ్ వాళ్లకు వీళ్ళు తక్కువ మార్క్స్ ఇస్తూ వస్తున్నారు. ఈ వారం కూడా అలాగే జరిగింది. అంజలి-పవన్ జోడికి 8 మార్క్స్ ఇచ్చారు నిఖిల్- కావ్య..తర్వాత నటరాజ్ మాస్టర్ జోడి 7 మార్క్స్ ఇచ్చారు.
"సాంగ్ సెలక్షన్ చాలా బాగుంది కానీ అంజలి ఎక్స్ప్రెషన్ కొంచెం కూడా నచ్చలేదు. ఫస్ట్ డే డాన్స్ పెర్ఫార్మెన్స్ నుంచి ఈరోజు వరకు ఎక్స్ప్రెషన్స్ లో పెద్ద మార్పులేమీ లేవు" అని నటరాజ్ మాస్టర్ చెప్పేసరికి "మరి ఇంతకు ముందు ఒక సాంగ్ కి ఇంప్రూవ్ అయ్యారని చెప్పారుగా" అని పవన్ రివర్స్ లో అడిగారు. "సెమి ఫైనల్ ముందు వరకు నేర్చుకుంటూ నేర్చుకుంటూ గ్రాఫ్ పెంచుకుంటూ వెళ్తారు కానీ ఇక్కడికి వచ్చేసరికి గ్రాఫ్ లో ఐపోయింది. ఎక్స్ప్రెషన్స్ అసలు నచ్చలేదు ..మీరు మళ్ళీ కూడా చూసుకోవచ్చు. అలాంటి ఎక్స్ప్రెషన్స్ కారణంగా ఆ సాంగ్ వేల్యూనే పోయింది" అని నాకు అనిపించింది చెప్పానన్నారు నటరాజ్ మాస్టర్.
తరుణ్ మాస్టర్ మరి మీకెందుకు అంజలి డాన్స్ నచ్చింది అని శ్రీముఖి అడిగేసరికి నటరాజ్ మాస్టర్ ఆయన అభిప్రాయం అది.. అంజలి కాస్ట్యూమ్ కి కరెక్ట్ గా న్యాయం చేసింది అని తనకు అనిపించింది అన్నారు తరుణ్ మాస్టర్. "నీతూ మరి మీ హజ్బెండ్ ఒపీనియన్ తో ఏకీభవిస్తావా" అని శ్రీముఖి అడిగేసరికి "ఆ సాంగ్స్ కి ఎక్స్ప్రెషన్స్ సరిగా చేయలేదు..ఆ సాంగ్ కి ఇంకా చాలా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి ఆ మజా నాకు రాలేదు " అని చెప్పింది నీతూ. ఇక ఆ "ఊలాల..ఊలాల" సాంగ్ కి నీతూ డాన్స్ చేసి ఎక్స్ప్రెషన్స్ ఇలా ఉండాలి అని చేసి చూపించింది.. ఇక అప్పుడు పవన్ ఎంట్రీ ఇచ్చి "అలా అందరూ ఉండలేరు..అలా అందరూ ఉంటే ఇలా ఎందుకు విడివిడిగా ఉంటాం" అని అనేసరికి "పుట్టగానే అందరం డాన్సర్స్ ఐపోము..మెల్లమెల్లగా డెవలప్ చేసుకుంటాం" అని చెప్పారు నటరాజ్ మాస్టర్.
![]() |
![]() |